బొగ్గు లారీ బైకు డీ ఒకరి మృతి

– 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ధర్నా నిర్వహించిన కుటుంబ సభ్యులు
నవ తెలంగాణ- కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం భూపాలపల్లి జాతీయ రహదారి 353 సి మేడిపల్లి గ్రామపంచాయతీ బస్వాపూర్ వద్ద బొగ్గు లారీ ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మహాముత్తారం మండలం పోలారం గ్రామపంచాయతీ లోని ఉట్లపల్లి గ్రామానికి చెందిన బీసుల పోచయ్య గుర్తించారు. పోచయ్య భూపాలపల్లి ద్విచక్ర వాహనంపై నుండి ఊట్లపెల్లి కి వస్తున్న క్రమంలో తాడిచర్ల నుండి బొగ్గు లోడ్ తో వెళ్తున్న చెల్పూర్ జెన్కో టిప్పర్ డీ కొనడంతో పోచయ్య మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని, రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని మహమూత్తారం ఎస్సై సుధాకర్, కాటారం ఎస్సై అభినవ్ హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. పోచయ్య కు ముగ్గురు కూతుళ్లు, భార్య ఉండగా ఇటీవల పెద్ద కుమార్తె కు వివాహం జరిపించినట్లు తెలిసింది.

Spread the love