పోషకాల గని కొబ్బరి నీళ్లు

వేసవి తాపాన్ని తీర్చేవి అంటే ముందుగా గుర్తొచ్చేది మజ్జిగ, కొబ్బరినీళ్ళు, తాటిముంజలు, చెరుకురసం. వీటిలో కొబ్బరి నీళ్ళది ప్రత్యేక స్థానం. సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ కొబ్బరి బోండాలు, కొబ్బరి కాయలు దొరికినా వేసవిలో వీటికి డిమాండ్‌ ఎక్కువ. తియ్యని, చల్లని కొబ్బరి నీళ్లంటే అందరికీ ఇష్టమే. కొబ్బరినీళ్లు దాహాన్ని తీర్చడమే కాకుండా ఎన్నో రకాల పోషకాలనూ అందిస్తాయి. అలసటను, నీరసాన్ని తగ్గించి, శరీరంలో శక్తి పెంచుతాయి. కొబ్బరి నీళ్లలో కార్బొహైడ్రేడ్లతో పాటు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం లాంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఖనిజాలు, లవణాలు లోపం ఉన్నవారు కొబ్బరి నీళ్లను తాగితే శరీరంలో వాటిని తిరిగి భర్తీ చేసుకోవచ్చు.
కండరాలు సవ్యంగా పనిచేసేందుకు పొటాషియం, ఎముకల పటుత్వానికి కాల్షియం, శరీరంలో ప్రొటీన్లు తయారు కావాలన్నా, రక్తపోటు స్థాయులు, రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండాలన్నా.. కండరాలు, నరాలు, ఎముకలు చక్కగా పనిచేయాలంటే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం చాలా అవసరం. ఖనిజ లోపం ఉన్నవారికి కొబ్బరి నీళ్లు దివ్యౌషధం.

Spread the love