నవతెలంగాణ – హైదరాబాద్: ఐటీ రంగంలో ప్రపంచస్థాయిలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికతో ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో దాదాపు 15 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్‌ను స్థాపించనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబులు.. కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కొత్త సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం జరిగినట్లు సీఎంఓ తెలిపింది.