నవతెలంగాణ – తాడ్వాయి
మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య బుధవారం అకస్మితంగా తనిఖీ చేశారు. తాసిల్దార్ కార్యాలయంలోని సమావేశ గది, స్టోర్ రూమ్, వివిధ గదులను పరిశీలించారు. కార్యాలయాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా నీట్ గా మెయింటెన్ చేయాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు బిఎల్ఓ తో మాట్లాడుతూ స్పెషల్స్ సమ్మరీ రివిజన్ లో భాగంగా ఈ సమయం ఎన్నికల సమయం కాబట్టి అందరూ బిఎల్వోలు ప్రతి ఇంటిని తనఖీచేసి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు నమోదు చేయాలని సూచించారు. అలాగే మృతి చెందిన వారిని తొలగించాలని, ఇంటి నెంబరు ఏదైనా మిస్టేక్స్ ఉంటే సరిచేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట డిపిఆర్ఓ రఫిక్ తదితరులు ఉన్నారు.