నారాయణపేటటౌన్ : విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రగతి సభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని జీపీ శెట్టి ఫంక్షన్ హాల్‌ను కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్‌తో కలిసి సమీక్షించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రగ తి సభ పనులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యుత్ ప్రగతి సభకు ప్రముఖులు హాజరు కానున్నారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడా లన్నారు. సభకు అధిక సంఖ్యలో విద్యుత్ అధికారులు పాల్గొనేటట్లు చూడాలని కోరారు. వచ్చినవారికి ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.