నారాయణపేట టౌన్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జిల్లాలో అన్ని రంగాల్లో జరిగిన ప్రగతి చాటేలా పండుగలా దశాబ్ది వేడుకలను నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్ ప్రజా వాణి సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై ప్రెస్ కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 9 సంవత్సరాల స్వయం పాలన పూర్తి చేసుకోని 10వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా జూన్ 2 నుంచి జూన్ 22 వరకు 21 రోజుల పాటు వైభవంగా వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు తెలియజేయాలని సూచించారు. రాష్ట్ర దశాబ్ది వేడుకల గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఘనంగా నిర్వహించాలని, ఎక్కడా ఎలాంటి పోరపాట్లు లేకుండా పకడ్బందీగా మన తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను వివరించాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కట్టుదిట్టంగా వేడుకలు నిర్వహించాలన్నారు. ప్రతి మండలంలో ఎంపీడీఓ, తాహసీల్దార్, ఎం.పీ ఓ, ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిం చాలన్నారు. ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్ధిచేకూరిన లబ్దిదారుల వివరాలు గ్రామాల వారీగా నివేదిక తయారు చేయాలని సూచించారు. సంక్షేమ సంబురాలు సందర్భగా గొర్రెల పంపిణీ రెండవ విడత ప్రారంభిస్తామని అన్నారు. ప్రస్తుతం సాధించిన విజయాలు అర్థమయ్యే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు చేసిన మేలు, వారికి కల్గిన లబ్ది వివరాలు గ్రామాల వారిగా ఫ్లెక్సీలు, పోస్టర్లు రైతు వేదికలతో పాటు గ్రామాల్లో ముఖ్య ప్రదేశాలో ప్రదర్శించాలని అన్నారు. సాగునీటి దినోత్సవం సందర్భంగా గతంలో ఉన్న ఆయకట్టు, ప్రస్తుత పరిస్థితి, అదనపు తూములు, చెరువులు, చెక్ డ్యాంల సంపూర్ణ సమాచారం అందించాలని అన్నారు. సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ప్రజ లకు కల్గిన లబ్ధి వరాలతో ప్రతి గ్రామంలో పోస్టర్‌లు ఏర్పాటు చేయాలని, గ్రా మాల వారీగా లబ్ధిదారుల వివరాలు ప్రజా ప్రతినిధులకు అందించాలని కోరారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో మారిన స్వరూపం, పెరిగిన పచ్చదనం, మౌలిక వసతులు తెలియజేస్తూ.. గ్రామాల వారీగా నాడు – నేడు పరిస్థితుల ఫొటోలు ప్రదర్శించాలని అన్నారు.