విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన విద్యను అందించాలి: కలెక్టర్

Special attention should be given to students and impart quality education: Collector– విద్యార్థులకు బోధిస్తున్న అంశాల పై ఆరా
– పాటశాలలోని వంటశాల, స్టోర్ గది,బాలుర టాయిలెట్ల సందర్శన
– పాఠశాల ఆవరణలో మూత్రశాల పరిశీలన
– గైర్హాజరైన ఉపాధ్యాయుల పై చర్యలకు ఆదేశాలు జారీ
– గీత నగర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
నవతెలంగాణ – సిరిసిల్ల
విద్యార్థుల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గీత నగర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు  అందిస్తున్న మధ్యాహ్న భోజనం, తయారీ విధానమును స్టోర్ రూమ్ లను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనము మెనూ ప్రకారం అందించాలని పేర్కోన్నారు. పాటశాల ఆవరణలోని బాలుర టాయిలెట్లను, పరిసరాలను స్వయంగా పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, ఏవైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని తెలిపారు. పాఠశాలలోని ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకుని హాజరు పట్టిక మరియు సాధారణ సెలవు రిజిస్టర్ లను పరిశీలించినారు. ముందస్తు సమాచారం లేకుండా, సెలవు దరఖాస్తు ఇవ్వకుండా గైర్హాజరైన ఉపాధ్యాయుల పై చర్యలకు డి.ఈ.ఓ ఆదేశాలు జారీ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శారద, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love