మెడికల్‌ కళాశాల పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్‌

నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్‌
జిల్లాలో ఇప్పటికే మెడికల్‌ కళాశాల నిర్మాణం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, తాత్కాలిక వసతి కోసం హాస్టల్‌ తరగతి గదులు, ల్యాబ్‌ నిర్వహణ ఏర్పాట్లు చేశా మని, మెడికల్‌ కళాశాల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సిహెచ్‌ శివలింగయ్య అన్నారు. శనివారం హైదరాబాదు నుండి మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సెక్రెటరీ రజ్వి, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ రమేష్‌ రెడ్డి రాష్ట్రంలో నూతన మెడికల్‌ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన, జరుగుతున్న పనిల పై సంబం ధిత జిల్లాల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్‌ రెడ్డి, విజ్వి రజ్వి మాట్లాడుతూ జిల్లాలో మెడికల్‌ కాలేజీలో వచ్చే సంవత్స రం తరగతుల ప్రారంభం నేపథ్యంలో ఇప్పటికే సూచించిన పనులను నిర్మాణం, వసతుల కల్పన, మెడికల్‌ ఇంజనీరింగ్‌ సిబ్బందితో కలిసి త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే సంబంఖధిత జిల్లా కలెక్టర్ల ద్వా రా తెలియపరచాలని కోరారు. అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశారుతో కలిసి ఈ స మావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ సిహెచ్‌.శివలింగయ్య మాట్లాడుతూ సాధ్య మైనంత త్వరగా పనులను పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గోపాలరావు, ఏరియా హాస్పిటల్‌ సూపరింటెం డెంట్‌ సుగుణాకర్‌ రాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ప్రశాంత్‌, ప్రోగ్రాం ఆఫీ సర్లు డాక్టర్‌ రవీందర్‌, డాక్టర్‌ అశోక్‌, వైద్య కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
లక్ష్య, ముస్కాన్‌ పథకంలో జిల్లాకు మొదటి స్థానం : కలెక్టర్‌
సెంట్రల్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ మంత్రిత్వ శాఖ రాష్ట్రంలోని అన్ని ఏ రియా మాత శిశు సంరక్షణ, కేంద్ర ఆస్పత్రుల్లో క్వాలిటీ లేబర్‌ రూమ్‌, ఆపరేషన్‌ థియేటర్స్‌ నిర్వహణ, వైద్యుల సేవ కోసం వచ్చేవారికి సంబంధించిన అత్యుత్తమ సేవలు అందించే సామర్థ్యం కలిగిన ఆస్పత్రుల్లో లక్ష్య, ముస్కన్‌ పథకాలలో తెలం గాణలో జనగామ జిల్లా మొదటి స్థానంలో ఉందని కలెక్టర్‌ సిహెచ్‌ శివలింగయ్య సంబంధిత వైద్యాధికారులను అభినందించారు. ప్రజలకు ఉత్తమమైన నాణ్యమైన సేవలు అందించి వారి మన్నన పొందాలని కలెక్టర్‌ సూచించారు.

Spread the love