సీజనల్ వ్యాధుల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి: కలెక్టర్

– ఆరోగ్య రహిత జీ.పీ. లుగా తీర్చిదిద్దాలి
– అన్ని పీహెచ్ సీ లలో మందులు, టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉంచాలి
– వనమహోత్సవానికి మొక్కలు సిద్ధంగా ఉంచండి
– మహిళా శక్తి ద్వారా సామర్ధ్యాన్ని పెంపొందించడం అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఆరోగ్య రహిత జి.పి.లుగా తీర్చిదిద్దటమే మన ముందున్న లక్ష్యమని అధికారులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీఓ లు, జీ.పీ. కార్యదర్శులు, మెడికల్ అధికారులతో జి.పి.లపై  ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..  వర్షాకాలం మొదలైనందున జీ.పీ.లలో ఎక్కడకూడా జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులతో పాటు గ్రామ, మండల స్థాయి అధికారులు కలసి పనిచేస్తూ నివారణకు కృషి చేయాలని సూచించారు.  అలాగే అన్ని పి.హెచ్.సి లలో   మందులు, టెస్టింగ్ కిట్స్ , వైద్యాధికారులు అందుబాటులో ఉండి వచ్చే రోజులకు వైద్య సేవలందించాలని సూచించారు. ప్రతి పి.హెచ్.సి లో ఓ.పి శాతం పెరగాలని అలాగే డెంగ్యూ, మలేరియా, వైరల్  ఫివర్స్ ప్రబలకుండా    ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
అదేవిదంగా జి.పి.లలో  రోజువారీ పారిశుధ్య పనులు ఎప్పడికప్పుడు చేపట్టాలని , వాటర్ ట్యాంక్ లను క్లోరినేషన్ చేపట్టాలని, వర్షం నీరు, మురుగు నీరు నిల్వను గుర్తించి తొలగించి ఆ ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లాలని సూచించారు. గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రజలకు  ఉదయం పూట వాహనాల ద్వారా మెసేజ్ రూపంలో అందించాలని సూచించారు. దోమలు ఉత్పత్తి కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని , గంబుషియా చేప పిల్లలు అవసరం మేరకు తెప్పించటానికి ప్రతిపాదనలు అందించాలని సూచించారు. జీ.పీ.లలో ఫాగింగ్, స్ప్రెయింగ్ తప్పక చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా త్రాగునీరు, వర్షపు,మురుగు నీరు కలుషితం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని సూచించారు. జీ.పీ.ల ద్వారా చేసిన పనులకు చెల్లింపులు, వసూళ్లు ఎప్పడికప్పుడు జరగాలని సూచించారు.  అదేవిదంగా పూర్తి అయిన జి.పి లలో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని , పూర్తి కానీ భవనాల పనులను పూర్తి చేయాలని తెలిపారు. పల్లె ప్రకృతి వనాలు,వైకుంఠ దామలు, సెగ్రిగేషన్ కేంద్రాల పై కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా  గర్భిణీలు, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందాలని అలాగే కేంద్రాల్లో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.జిల్లాలో వచ్చే జూలై  ఒకటి నుండి వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభం కానున్నందున  జిల్లాలో  గుర్తించిన ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటాలని, అన్ని నర్సరీలలో మొక్కల వివరాలు అందించాలని సూచించారు.
మహిళ శక్తి పథకం ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన మహిళ శక్తి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ పేర్కొన్న న్నారు. మహిళా శక్తి ద్వారా 14 రకాల కార్యక్రమాలు చేపడుతున్నామని వారిలో కుట్టు కేంద్రాలు, పౌల్ట్రీ మత్స్య విక్రయ అవుట్లెట్లు, టెంట్ హౌస్ లు ,మీసేవ కేంద్రాలు ,మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో 4 లేదా 5 లబ్ధిదారులను గుర్తించి శిక్షణ ఇవ్వాలన్నారు .జిల్లాలో 11,000 మందికి ఈ పథకం ద్వారా ఆర్థిక బలోపేతం చేయవచ్చున్నారు. ఎం జి ఎనర్జీ ఎస్ కింద చేపట్టిన పనులు పంచాయతీ సెక్రటరీలు కొన్నిచోట్ల సరిగా పాల్గొనడం లేదని, పనులు పూర్తయిన వాటికి ఎఫ్ టి ఓ లు జనరేట్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. జూలై 1 నుండి మంచిగా పనిచేసే అధికారులకు సిబ్బందికి అండగా ఉంటానని విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండి  విధులు నిర్వహించకపోతే అట్టి వారిపై చర్యలు తీసుకుంటానని, ఆకస్మికంగా గ్రామపంచాయతీలు పరిశీలిస్తానని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో  జెడ్పి సి.ఈ. ఓ  వివి అప్పారావు, డే.ఎఫ్.ఓ సతీష్ కుమార్, పి.డి. మధుసూదన రాజు, డి.పి.ఓ సురేష్ కుమార్, ఏడియం హెచ్ ఓ నిరంజన్, ఎంపీడీఓ లు, కార్యదర్శులు, ఎం పి ఓ లు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love