ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు: కలెక్టర్

– ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు, సిబ్బంది తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు ను వినియోగించుకొనుటుకు కలెక్టరేట్ లో   ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ (వి ఎఫ్ సి) లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణ సందర్బంగా అధికారులు, సిబ్బంది కి ఇచ్చే శిక్షణ కు  వచ్చే ఉద్యోగులు, సిబ్బంది ఏదేని  ఒక గుర్తింపు కార్డు చూపి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం తేదీ. 22-5-2024 నుండి 24-5-2024 వరకు  అందుబాటులో ఉండునని కలెక్టర్ తెలిపారు.
Spread the love