– సిరిసిల్ల, వేములవాడలో ఆర్థో వైకల్య నిర్ధారణ పరీక్షల నిర్వహణ..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించిన సదరం శిబిరాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్థో వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా, కలెక్టర్ పరిశీలించారు. ఈ రోజు ఎందరికి పరీక్షలు చేశారో వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య ను అడిగి తెలుసుకున్నారు. 36 మందికి గానూ 33 మందికి చేసినట్లు లెక్టర్ దృష్టికి డాక్టర్ తీసుకెళ్లారు. ఇక్కడ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్, డీఆర్డీవో ఏపీఎం పాపారావు తదితరులు పాల్గొన్నారు. *సిరిసిల్లలో..* ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సిరిసిల్లలో ఆర్థో వైకల్య నిర్ధారణ పరీక్షలకు 55 మంది దరఖాస్తు చేసుకోగా, 49 మంది హాజరు అయినట్లు ఆర్ఎంఓ సాయి కుమార్ తెలిపారు. శిబిరంలో డిప్యూటీ సూపరింటెండెంట్ సంతోష్ కుమార్, ఎముకల వైద్య నిపుణురాలు డాక్టర్ సాధన తదితరులు పాల్గొన్నారు.