– కార్పొరేట్లు కారాబ్ చేసిన ఏం కాదట?
– కంకర రోడ్డును తలపిస్తున్న వైనం
– ప్రమాదాలకు గురవుతున్న ప్రయాణికులు
– తల పట్టుకుంటున్న కలెక్టరేట్ ఉద్యోగులు
– రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిన వైనం
ఇది కంకర రోడ్డు అనుకుంటే పొరప డినట్లే.. ఇది కలెక్టరేట్ రోడ్డు. వేలాది వాహ నాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. కానీ కంకరతోనే దర్శనమిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని మట్టి రోడ్డును తలపిస్తోంది. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన బీటీరోడ్డు పూర్తిగా కంపరరోడ్డుగా మారిపో యింది. దీన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ సైతం ఈ మార్గంలోనే పయనిస్తారు. అయినా చర్యలు శూన్యం. ప్రాణాలు పోయినా పరవాలేదన్నట్లుగా అధికార యంత్రాంగం దుస్థిితి నెలకొంది.ఆ రోడ్డుపై ఒక లుక్కేదాం.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఏర్పాటైన జిల్లా సంయుక్త కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లాలంటే ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణం సాగించాల్సిందే. గత నాలుగు మాసాలుగా ప్రమాదాల కోర్చి ప్రయాణం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కలెక్టరేట్ జంక్షన్ నుంచి కలెక్టర్ కార్యాలయానికి సుమారు కిలోమీటర్ దూరం నరక ప్రయాణం సాగించాల్సి ఉంది. అయితే కలెక్టరేట్ సమీపంలో నిర్మితమవుతున్న పాక్స్ కాన్ కంపెనీకి నిర్మాణం సాగుతోంది. ఆ సంస్థ నిర్మాణం కోసం సమీపంలోని పలు క్రషర్ల ద్వారా నిత్యం వందలాది కంకర టిప్పర్లు కంకరను తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే వాహనాల ద్వారా ఎగిరి పడుతున్న కంకర రాళ్లతో పూర్తిగా కలెక్టరేట్ రోడ్డును కమేసింది. కోట్లాది రూపాయలు వెచ్చించ నిర్మించిన బీటీ రోడ్డుపై కంకర పరుచుకోవడంతో బీటీ రోడ్డు కాదు.. ఇది కంకర రోడ్డే అని విమర్శిస్తున్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే మట్టి రోడ్డు సైతం బాగుంటుందని విమర్శిస్తున్నారు. ఇటీవల కలెక్టరేట్‌లో పనిచేసే ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగి తన దీచక్ర వాహనంపై వెళ్తుండగా కంకర వల్ల స్కిడ్ అయి పడిపోయింది. తీవ్ర గాయాలతోనే విధులు నిర్వహించిందని స్థానికులు వాపోతున్నారు. ఈ రోడ్డు మార్గంలో జిల్లా కలెక్టర్ మొదలుకొని మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టరేట్ ఉన్నతాధికారులు ప్రయాణం సాగిస్తున్న ఈ కంకర రోడ్డు దుస్థితి గురించి మాత్రం పట్టించుకోవడం లేదని దుయ్య బడుతున్నారు. చేసేది లేక నిత్యం ప్రాణ భయంతోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సాధారణ వ్యక్తులో, మరొకరు అయితే ఇప్పటికే వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే వారు. ఫైన్లు రాసే వారు. కానీ చైనాకు చెందిన పాక్స్ కాన్ కంపెనీకి తరలిస్తున్న కంకర వాహనాలను విచ్చల విడీగా ప్రధాన రోడ్డుపై కంకరను పరుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగానే కలెక్టరేట్ రోడ్డు కంకర రోడ్డును తలపిస్తోంది. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకు ంటున్నారు.