– అంగన్‌వాడీల సమస్యలు ప్రభుత్వానికి కనబడట్లేదా..
– సీఐటీయూ రాష్ట్ర నాయకులు బంధు సాయిలు..
నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్
రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు, ఆయాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సంద ర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు బంధు సాయిలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి చెన్నూరి రమేష్ పాల్గొని మాట్లా డారు. రాష్ట్రంలో సుమారు 70వేల మంది అం గన్‌వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరంతా మహిళలు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారేనని అన్నారు. 40 సంవత్సరాలకు పైగా ఐసీడీఎస్‌లో పనిచేస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. అయినా వీరికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్‌ఐ ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిం చట్లేదని వాపోయారు. మన పక్కనే ఉన్న తమిళనాడు, రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభు త్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాయని, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో హెల్త్ కార్డులు ఇచ్చారని, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండుగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సౌకర్యాలు అంగనవాడి ఉద్యోగులకు కల్పించడం లేదన్నారు. వెంటనే వారి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సత్యవని, జయప్రభ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆడప సంతోష్ సీఐటీయూ జిల్లా నాయకులు శ్రీనివాస్ టీచర్లు పద్మ, అన్నపూర్ణ, రామ. స్వప్న, సత్యవతి, నిర్మల, జ్యోతి, శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి : సీఐటీయూ, ఏఐటీయూసీ
నవతెలంగాణ -ములుగు
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించా లని రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా సీఐటీ యూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం డీఎల్‌ఆర్ ఫంక్షన్ హల్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీసీ కలెక్టర్ కార్యాలయం ముట్ట డించారు. కలెక్టర్ రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నా సుమారు రెండు గంటల పాటు జరిగింది. అనంతరం అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందిం చారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్య దర్శి రత్నం రాజేందర్, ఏఐటీయూసీ జిల్లా కా ర్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల మంది అంగన్వాడీ సిబ్బంది న్యాయమైన డిమాండ్లు పరిష్కరిం చడం లేదన్నారు. సమ్మె నోటీస్ ఇచ్చిన సంఘాలను చర్చలకు పిలవకుండా, సమ్మెలో లేని సంఘా లను, ప్రభుత్వ మోచేతి నీళ్ళు తాగే సంఘాలను పిలిచి చర్చలు జరిప సమ్మె విచ్ఛిన్నంకు కుట్ర లు చేసిందన్నారు. సమస్యలు పరిష్కరించ కుంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వా నికి సమాధి కడతారని అన్నారు. సీఐటీయూ, ఏఐటియూసి జిల్లా అధ్యక్షులు ఎండి దావుద్, ఇరు సంఘాల నాయకులు కట్ల రాజు, రాజేందర్, మహేష్, అంగన్‌వాడీ యూనియన్ ల జిల్లా నాయకులు కె సరోజ, సమ్మక్క, కష్ణ కుమారి, మీణకుమారి, ప్రేమకుమారి, అరుణ కుమారి, వెంకటరమణ, పద్మ రాణి, సమ్మక్క, జమున, మోక్ష, తదితరులు పాల్గొన్నారు.