తంతోలి గ్రామంలో కలెక్టర్‌ పర్యటన

Collector's visit to Thantoli villageనవతెలంగాణ-ఆదిలాబాద్‌రూరల్‌
మండలంలోని తంతోలి గ్రామంలో మంగళవారం జిల్లాకలెక్టర్‌ రాజర్షిషా విస్తృతంగా పర్యటించారు. ముందుగా అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, చిన్నారులకు అందిస్తున్న షౌష్టికాహారాన్ని పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్యాలయం, చౌకధరల దుకాణాన్ని పరిశీలించారు. అనంతరం ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, గ్రామాల్లో ఉన్న సమస్యలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా రేషన్‌ షాపులో నిల్వ ఉన్న బియ్యం బస్తాలను ఎన్ని ఉన్నాయి, స్టాక్‌ వివరాలను, బియ్యం నాణ్యతను రేషన్‌ డీలర్‌ను అడిగి తెలుసుకున్నారు. షాప్‌ను పరిశుభ్రంగా ఉంచాలని ఎక్కడపడితే అక్కడ చెత్త చెదారం లేకుండా శుభ్రత పాటించాలని ఆదేశించారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఋణం పొంది కిరణా షాప్‌ ద్వారా ఉపాధి పొందుతున్న మహిళను వ్యాపారం ఎలా నడుస్తుందని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి, కమ్యూనిటీ సోఫ్‌ కిట్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, తనిఖీ రిజిష్టర్‌ మెయింటెన్‌ చేయాలని, ఎంతమంది విద్యార్ధులకు వంట చేస్తున్నారు. మెనూ ప్రకారం అందిస్తున్నారా, ఒక విద్యార్థికి అందించాల్సిన గ్రాముల ప్రకారం వంట చేయాలని, ప్రధానోపాధ్యాయులు రవీందర్‌రెడ్డిని ఆదేశించారు. విద్యార్ధులతో ముచ్చటిస్తూ పాఠాలను చదివించారు. విద్యార్ధులకు కోడిగుడ్లు ఎన్ని రోజులు ఇస్తున్నారని ఆరా తీయగా వారంలో మూడు రోజులు ఇస్తున్నామని తెలిపారు. మధ్యహ్నం భోజనం, పారిశుధ్య పనుల తీరును పరిశీలించి, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి నాగభూషణం, తహసీల్ధార్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Spread the love