– కోలేటి దామోదర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరువు కాటకాలతో ఇంతకాలం కునారిల్లిన పూర్వ మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల మెడలో కృష్ణా జలాల మణిహారాన్ని సీఎం కేసీఆర్ వేశారని తెలంగాణ గృహనిర్మాణ సంస్థ చైర్మెన్ కోలేటి దామోదర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వలస జిల్లాలుగా పేరుపడ్డ దక్షిణ తెలంగాణాలోని ఆరు జిల్లాలను సస్యశ్యామలంగా మార్చేందుకు సీఎం చేసిన కృషి మరవలేనిదని పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణాతో సహా దేశంలోని రైతు లోకం తమ హర్షాతిరేకలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.