
తెలంగాణ రాష్ట్రం హ్యాండ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని పెర్కిట్ విశాఖ నగర్ నవ్య భారతి గ్లోబల్ స్కూల్ నందు ఉమ్మడి జిల్లాల సీనియర్ మేన్ అండ్ ఉమెన్ హ్యాండ్ బాల్స్ సెలక్షన్స్ ని జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గంగ మోహన్ చక్రు, ప్రధాన కార్యదర్శి పింజ సురేందర్ ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ఎంపికకు ఉమ్మడి జిల్లాలలోని వివిధ గ్రామాల నుండి క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా సీనియర్ మెన్ ,ఉమెన్ హ్యాండ్ బాల్ జట్టుకు ఎంపిక చేయడం జరిగినది. ఈ ఎంపికైన క్రీడాకారులు ఈనెల 17,18 &19 తేదీలలో కరీంనగర్ లో జరగబోయే 52 వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ హ్యాండ్ బాల్ పోటీలలో పాల్గొనడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా హ్యాండ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి పింజ సురేందర్, కోశాధికారి గట్టడి రాజేష్ తదితరులు పాల్గొనగా ,ఈ కార్యక్రమానికి అతిథులుగా జిల్లా హాకీ సంఘం అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి , నవ్య భారతి గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ జవహర్ హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ, వ్యాయామ ఉపాధ్యాయులు మాధురి, కొండ్రా అంజు, సంజీవ్, అనూష తదితరులు పాల్గొన్నారు.