ప్రతీకార జ్వాలతో మళ్ళీ వచ్చేస్తోంది

Coming back with a vengeanceఅంజలి నటించిన ‘గీతాంజలి’ సినిమాను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాకు సీక్వెల్‌ సిద్ధమైంది. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అంటూ ‘గీతాంజలి’ సీక్వెల్‌ గురించి మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. ఓ పాడుబడ్డ బంగ్లా ప్రాంగణంలో ఆ బంగ్లాని చూస్తూ కూర్చుని ఉన్న అమ్మాయితో పోస్టర్‌ సినిమాపై ఆసక్తి కలిగిస్తూ, ఆకట్టుకుంటోంది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ శనివారం నుంచి మొదలైంది. కోన వెంకట్‌ సమర్పిస్తున్న ఈ సినిమాను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అంజలి నటిస్తున్న 50వ సినిమా ఇది. ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి రామచంద్ర క్లాప్‌కొట్టారు. సినిమా స్క్రిప్ట్‌ని ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్‌ సంయుక్తంగా డైరెక్టర్‌ శివ తుర్లపాటికి అందజేశారు. శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్‌, సత్య, షకలక శంకర్‌, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్‌, రాహుల్‌ మాధవ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Spread the love