నవతెలంగాణ – హైదరాబాద్: విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా టైటిల్‌కి తగ్గట్టుగానే సంక్రాంతికి రానుంది. వచ్చే ఏడాది జనవరి 14న ఈ మూవీని విడుదల చేస్తామని ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎఫ్2, ఎఫ్3 తర్వాత వెంకీ-అనిల్ కాంబోలో ఇది మూడవ సినిమా కావడం విశేషం.