ప్రజా పాలన సేవా కేంద్రాలు ప్రారంభం: కలెక్టర్

– ఎంపీడీవో, మున్సిపాలిటీ కార్యాలయాలలో సేవా కేంద్రాలు: జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రజాపాలన సేవా కేంద్రాలను సోమవారం నుండి ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. చీఫ్ సెక్రటరీ వీడియోకాన్ప్రస్ అనంతరం జిల్లా కలెక్టర్ వెబ్స్ఎక్స్ ద్వారా సంబంధిత అధికారులతో వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీడీవో కార్యాలయాలలో శనివారం సాయంత్రం కల్లా ప్రజా పాలన సేవా కేంద్రాలను ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు . 23 ఎంపీడీవో కార్యాలయాలలో ఈ – పంచాయతీ ఆపరేటర్లను డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్ తెలిపారు .ప్రజాపాలన సేవా కేంద్రాలు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతాలలో సోమవారం నుండి ప్రజాపాలన కేంద్రాలు నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు సూర్యాపేట మున్సిపాలిటీలో ఐదు సేవా కేంద్రాలు తుంగతుర్తి మున్సిపాలిటీలో రెండు సేవా కేంద్రాలు కోదాడలో మూడు సేవా కేంద్రాలు హుజూర్నగర్ లో రెండు సేవా కేంద్రాలు నేరేడుచర్ల లో ఒక సేవా కేంద్రం ఏర్పాటు చేసి ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను సరైన వివరాలు నమోదు చేయని వారి కోసం ప్రజాపాలన సేవాకాంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు ఈ కేంద్రాల ద్వారా వారి పూర్తి వివరాలను డేటా ఏంటి ఆపరేటర్లకు తెలపాలని కలెక్టర్ సూచించారు ఈ కేంద్రాలు శాశ్వత ప్రతిపాదన పనిచేసే అవకాశాలు ఉన్నందున అన్ని సేవా కేంద్రాలలో ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు కంప్యూటర్ ఏర్పాటు కొరకు ప్రతి మండలానికి 26వేల రూపాయలు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు.గతంలో నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోలేకపోయిన వారికోసం, కొత్త దరఖాస్తులు చేసుకునేందుకు వీలుగ అభయస్తం దరఖాస్తు ఫారాలను ప్రజాపాలన సేవా కేంద్రాలలో  అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన సేవా కేంద్రాల నిర్వహణ అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు ఈ వెబిక్స్ కార్యక్రమంలో జడ్పీసీఈఓ అప్పారావు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు స్పెషల్ అధికారులు పాల్గొన్నారు. ముందుగా వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మిషన్ భగీరథ అధికారులతో ఆదేశాలను జారీ చేశారు. జిల్లాలోని అన్ని మండలాలలో సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Spread the love