న్యూఢిల్లీ : అక్టోబర్ నెల ప్రారంభంలో గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. కమర్షియల్ (వాణిజ్య) సిలిండర్ ధరను కేంద్రం ఒక్కసారిగా రూ.209లు పెంచింది. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలండర్ ధర రూ.1,522.50 నుంచి రూ.209 పెరిగి రూ.1,731.50కు చేరింది. ధరల పెంపు ఢిల్లీతో పాటు అన్ని నగరాల్లో ఆదివారం (అక్టోబర్ 1) నుంచి అమలులోకి వస్తుంది. పెరిగిన ధరతో ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,731.50కి చేరింది. కోల్‌కతాలో రూ.1,839.50, చెన్నెలో రూ.1,898, ముంబయిలో రూ.1,684గా ఉంది. అదే సమయంలో గృహ వినియోగదారులకు మాత్రం ధరల పెరుగుదల నుంచి ఊరట లభించింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను స్థిరంగా ఉంచింది. ఆగస్టు 29న జరిగిన క్యాబినెట్ సమావేశంలో గహ వినియోగదారులందరికీ ఎల్పీజీ సిలిండరు ధరకు రూ. 200 సబ్సిడీ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.