
జాతీయస్థాయిలో 24 మార్చ్ నుండి 28 మార్చ్ 2025 వరకు జాతియ స్థాయిలో చత్తీస్ గడ్ రాష్ట్రంలో నిర్వహించినటువంటి ఉష్ క్రీడోత్సవాలలో నిర్వహించడం జరిగింది. ఈ ఉష్ క్రీడల యందు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లా కు చెందినటువంటి ఎండి. తజ్ ముల్ హైమద్ ఏ. ఆర్. ఎస్. ఐ కుమారుడు ఎం.డి యాసిర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ క్రీడలలో యాసిర్ అహ్మద్ కి బ్రాంజ్ మెడల్ , ప్రశంసా పత్రం లభ్యం అయింది. ఈ బ్రాంజ్ మెడల్, ప్రశంసా పత్రం మంగళవారం నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, చేతుల ద్వారా ప్రధానం చేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రం పేరు నిలబెట్టడం ఎంతో సంతోషకరమైందని ఇదేవిధంగా భవిష్యత్తులో ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా భారత దేశం నుండి ప్రాతినిధ్యం వంచి ఎన్నో మెడల్స్ సాధించి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్క సిబ్బంది ఇదే స్ఫూర్తితో తమ పిల్లలను క్రీడలలో ప్రోత్సహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.