ప్రారంభానికి సిద్ధంగా సీపీపీ.. తుది దశలో కమీషనింగ్..

CPP ready to start..Commissioning in final stage..నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ కు అవసరం అయ్యే విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించిన క్యాప్టివ్ పవర్ ప్లాంట్   (విద్యుత్తు టర్బైన్) లాంచనంగా ప్రారంభించేందుకు సిద్దంగా ఉంది.దీని కమీషనింగ్ తుది దశకు చేరుకుని విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది.  పామాయిల్ పరిశ్రమలో 2.5 మెగా వాట్ విద్యుత్తును స్వతంత్రంగా తయారు చేసుకుని పరిశ్రమ అవసరాలకు అందజేసేందుకు వీలుగా దీనిని నిర్మించారు.కమీషనింగ్ ప్రారంభించిన ఇంజనీరింగ్ అధికారులు తుది  దశను చేరుకుందని తెలిపారు. పూర్తి కంప్యూటర్ రైజ్డ్,ఆటోమేటిక్ యంత్రాలతో చేపట్టిన దీని నిర్మాణానికి రూ.36 కోట్లు ఖర్చు చేశారు.షెడ్డెడ్ ఫైబర్ తో నడిచే ఈ బాయిలర్ సామర్థ్యం 30 టీ పీ హెచ్(టన్స్ పర్ అవర్), 2.5 మెగా వాట్ విద్యుత్తు ఉత్పత్తి చేసే విదంగా గతేడాది జులై లో ప్రారంభించి నిర్మాణం పూర్తి చేసారు. దీనివల్ల నెలకు రూ.15 లక్షలకు తగ్గకుండా విద్యుత్తు బిల్లు ఆదా అవుతోంది.దీనివల్ల ఏడాదికి రూ.15 కోట్ల నుంచి రూ. 18 కోట్ల వరకూ ఆదా కానుంది. అలాగే ఎలాంటి విద్యుత్తు అంతరాయాలు లేకుండా పామాయిల్ పరిశ్రమకు అందుతుంది.దమ్మపేట మండలం అప్పారావు పేట పామాయిల్ పరిశ్రమలో వినియోగించిన ఇదే సాంకేతిక పరిజ్ఞానం మంచి పలితాలు ఇస్తోంది.  త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.వచ్చే ఏడాది నుంచి నూతన పామాయిల్ పరిశ్రమ 60 టన్నుల సామర్థ్యంతో నిర్వహించే ప్లాంట్ పనులు ప్రారంభించనున్నారు.దీనిపై అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ మేనేజర్ మంద నాగబాబు నవతెలంగాణ తో మాట్లాడుతూ కొద్ది రోజుల్లో నూతన బాయి లర్ ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నాం అని అన్నారు.
Spread the love