వీర తెలంగాణ సాయుధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులే: పద్మ

నవతెలంగాణ-భిక్కనూర్
వీర తెలంగాణ సాయుధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులే అని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మ తెలిపారు. గురువారం మండలంలోని జంగంపల్లి గ్రామంలో మల్లు స్వరాజ్యం కాలనీలో వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పద్మ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం జరిగిన ఈ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు అమరవీరులయ్యారని సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరుల రక్తపు మరకలు ఇప్పటికీ చెదరకుండా ఉన్నాయన్నారు. సాయుధ పోరాటంలో పాల్గొన్న మల్లు స్వరాజ్యం గారి పేరుతో కాలనీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎర్రజెండా ఆధ్వర్యంలో 3000 గ్రామాల విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూమి పంచిన ఘనత కమ్యూనిస్టులకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు, నాయకులు ప్రవీణ్, నరసవ్వ, బాల్ రాజ్, రవి, శ్యామల, రమణ, కవిత, బాలమణి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love