నవతెలంగాణ- జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ జోన్ కమిటీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిన్న రాత్రి జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీధి నాటకం పలువురిని ఆకర్షించింది . వందలాదిమంది ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సాయి శేషగిరిరావు అధ్యక్షత వహిస్తూ ఈ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులేనని, ఇప్పుడున్న అన్ని పార్టీలు రకరకాలుగా చెప్పుకున్నా, వాస్తవానికి వారసులు కమ్యూనిస్టులేనని చరిత్ర చెప్తుందని ,ఆ వారసత్వ పోరాటాలని ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉందని, కొనసాగిస్తామని తెలియజేశారు .అప్పటి సంఘటనల కళారూపకాలు ప్రదర్శించిన ప్రజానాట్యమండలి కళాకారులబృందానికి, కామ్రేడ్ మారన్న, రాజు, బి.ఆర్ నాయుడు, పుల్లారావు నాయకత్వం వహించారు. జూబ్లీహిల్స్ జోన్ నాయకులు ఆర్ అశోక్ ,జె స్వామి, శ్రీను, కృష్ణ , సంపత్, లక్ష్మణ్, గంగులప్పా ,సోమ్లా నాయక్, బాలు సంపత్, సువర్ణ, నాగమణి, వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు.