శాంతి భద్రతల పరిరక్షణకు కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం

– డీఎస్పీ కే. సత్యనారాయణ
ఊట్కూర్‌ : నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణకు కమ్యూనిటీ కాంట్రాక్ట్‌ ప్రోగ్రాం అని నారాయణపేట డీఎస్పీి కే సత్యనారాయణ అన్నారు. మండలంలోని తిప్రస్‌పల్లి గ్రామంలో సాయంత్రం 6 గంటలకు సీిఐ సీతయ్య ఆధ్వ ర్యంలో సీఐలు ఇద్దరూ, ఎస్‌ఐ -ఆరుగురు, ఏ ఎస్‌ఐ – నలుగురు, హెచ్‌ సీ లు నలుగురు, పీసీలు 40, స్పెషల్‌ పార్టీ సిబ్బంది మొత్తం 60మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం నిర్వహించారు. మొత్తం 06 విభాగాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించి కొంతమంది వ్యక్తిగత వివరాలు సేకరించి వారిపై గతంలో ఏదైనా నేరాలు ఉన్నాయా అనే విషయాన్ని చెక్‌ చేసి 120 ఇళ్లను సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు సంబంధించి సరైన ధవ పత్రాలు చూయించి తమ వాహనాలను తీసుకపోవాలని తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెన్సాఫ్‌ సెక్యూరిటీ కల్పించడంపై, ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్‌ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ అందరు కలిగి ఉండాలి అన్నారు. వాహనాల సంబందించిన అని ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌ కలిగి ఉండాలి అన్నారు. మహిళల భద్రతే పోలీస్‌ లక్ష్యం అన్నారు. మహిళ పట్ల, చిన్న పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిం చిన, వారిని మానసిక, శారీరకంగా హింసించిన వారి పట్ల చట్టప రమైన కఠిన చర్యలు తీసుకుం టాం కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని తెలి పారు. ప్రజలు, మహిళలు ఆపద సమ యంలో, ఎవరైనా చట్ట వ్యతిరేకమైన కార్యక లాపాలకు పాల్పడిన, యువ కులు గుంపులు గా ఏర్పడి బహిరంగ మద్యపానం సేవించిన, ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన, వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్‌ 100 కు కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజల రక్షణ కొరకు పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారు అని తెలిపారు. వ్యాపా ర సముదాయాల దగ్గర, కాలనీలలో, గ్రామా లలో మరింత స్వీయ రక్షణకు సీసీ. కెమెరాలను అమర్చు కోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటు ందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని సీసీ కెమెరాలు ఉండటం వల్ల ఎవరైనా దొంగతనాలు చేయడానికి అయినా, అమ్మా యిలను, మహిళలను వేధించాలన్న, అసాంఘిక కార్యక లాపాలు నిర్వహించడానికి భయపడతారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డిఎస్పి గారు తెలిపారు. మీ కాలనీలో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెం టనే పోలీస్‌ లేదా డయల్‌ 100 కు ఫోన్‌ చేసిన వెంటనే చర్యలు చేపడతా మన్నారు. తనిఖీలు నిర్వహి ంచడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ లు సీతయ్య, శ్రీకాంత్‌ రెడ్డి, ఎస్సైలు రమేష్‌, అబ్జాల్‌, పర్వ తాలు, విక్రమ్‌, విజయ భాస్కర్‌, నరేందర్‌, గ్రామ సర్పంచ్‌ సుమంగళి, జెడ్పీటీసీ అశోక్‌ గౌడ్‌,ఎంపీటీసీ రవి, ప్రజలు, స్పెషల్‌ పార్టీ సిబ్బంది, కానిస్టేబుల్స్‌ పాల్గొన్నారు.

Spread the love