కువైట్ అగ్నిప్రమాదం: బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటన

నవతెలంగాణ – హైదరాబాద్ : కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఏపీకి చెందిన ముగ్గురు కార్మికులు చనిపోగా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా మొత్తం 45 మంది భారతీయులు ఈ ప్రమాదంలో చనిపోగా వారి మృతదేహాలు ఇవాళ స్వదేశానికి చేరుకున్నాయి.

Spread the love