తెలంగాణలో సొంతంగానే పోటీ

Competition in Telangana itself– టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టీకరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలంగాణలో ఏ పార్టీతో పొత్తుల్లేవని ఒంటరిగానే టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర నేతలకు స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌, పోలిట్‌ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డితోపాటు పలువురు ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, కాసాని నిర్వహించే బస్సు యాత్ర, పోటీ చేసే అభ్యర్థులు, తెలంగాణలో రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
పలు నియోజవర్గాల్లో పార్టీ పరిస్థితులు, చేసిన కార్యక్రమాలపై చంద్రబాబుకు కాసాని జ్ఞానేశ్వర్‌ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీతో తెలంగాణలో కలిసి పోటీ చేసే పరిస్థితి లేదనీ, ఒంటరిగా పోటీ చేయడానికే సిద్ధపడాలని బాబు సూచించారు. తెలంగాణను అభివద్ధి చేసింది తెలుగుదేశమేనంటూ బస్సుయాత్రలో చెప్పాలన్నారు. రాష్ట్రంలో అనేక అభివద్ధి కార్యక్రమాలు చేయడంతోపాటు హైదరాబాద్‌ అభివద్ధి చెందిందన్నారు. దేశంలో మొదటిసారిగా ఔటర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని గుర్తు చే
శారు. విజన్‌ 2020 పెట్టి అభివద్ధి చేశామనీ, నేడు విజన్‌ 2047 తో మందుకు సాగుతున్నామన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండడం చారిత్రాత్మక అవసరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా తెలుగుదేశం పార్టీ చేసిన అభివద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని వివరించారు. మన పార్టీపై ఉన్న ప్రేమ అభిమానం టీడీపీ నాయకులు ఉపయోగించుకోవాలన్నారు. త్వరలోనే అందరితో మాట్లాడి అభ్యర్థుల జాబితా ప్రకటించాలని అన్నారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బస్సు యాత్ర చేపట్టాలని నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్‌, అలి మస్కతి, సామ భూపాల్‌ రెడ్డి, జక్కలి ఐలయ్య యాదవ్‌. బండారు వెంకటేష్‌తో పాటు పోటీ చేసే అభ్యర్థులు తదితులున్నారు.

Spread the love