![](https://navatelangana.com/wp-content/uploads/2024/11/Ramagiri-1_-.jpg)
సమాచార హక్కు చట్టం ద్వారా చేసుకున్న దరఖాస్తుకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా కాలయాపన చేస్తున్న సింగరేణి అధికారులపై సంస్థ సీ అండ్ ఎండి బలరాం నాయక్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు రామగిరి మండలం నాగేపల్లికి చెందిన రామిని గోపాలకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రత్నాపూర్ పంచాయతీ పరిధి రాంనగర్ కు చెందిన ఆల్లెపు శ్రీనివాస్ అనే వ్యక్తి సంబంధిత సింగరేణి అధికారుల సహకారంతో అర్జీ-3 ఏరియాలో నకిలీ సివిల్ కాంట్రాక్టర్ రిజిస్ట్రేషన్ పొందినట్లు తెలిపాడు. దీనిలో భాగంగా అల్లెపు శ్రీనివాస్ అనే వ్యక్తి ఏ కాంట్రాక్టర్ వద్ద ఎంతకాలం సూపర్వైజర్ గా పని చేశాడో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నాకు సమాచార హక్కు చట్టం ప్రకారం అందించాలని సంబంధిత అధికారులను కోరగా సరైన సమాచారం ఇవ్వకుండా దాటవేస్తున్నారు అని తెలిపారు. నాకు సరైన సమాచరం ఇప్పించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, నకిలీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న శ్రీనివాస్ పై చట్టరీత చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ మేరకు స్పందించిన సీ అండ్ ఎండీ బలరాం నాయక్ వెంటనే సంబంధిత విజిలెన్స్ అధికారులను ఎంక్వయిరీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.