బీఆర్ఎస్ పార్టీ ప్లెక్సీలో రెంజల్ జడ్పిటిసి ఫోటో రావడంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

నవతెలంగాణ: రెంజల్ : బోధన్ పట్టణానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు రెంజల్ బిజెపి జడ్పిటిసి మేక విజయ ఫోటోలు పెట్టడం శోచనీయమని రెంజల్ బిజెపి మండల అధ్యక్షులు గోపికృష్ణ స్పష్టం చేశారు. గతంలో ఇలాగే క్లిక్సిలో ఆమె ఫోటోను పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకుల పై రెంజల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అట్టి వ్యక్తి పై చట్టపరమైన చర్య తీసుకోవాలన్నారు. ఆయన వెంట రెంజల్ మండల ఉపాధ్యక్షులు యోగేష్, మాజీ మండల అధ్యక్షులు మేక సంతోష్, నాయకులు పార్థ రమేష్ తదితరులు ఉన్నారు.
Spread the love