– అజ్మీర కృష్ణవేణి బిజెపి రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యురాలు
నవతెలంగాణ-గోవిందరావుపేట : సంపూర్ణ మహిళ సాధికారత బిజెపితోనే సాధ్యం అని ఆ పార్టీ రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యురాలు అజ్మీర కృష్ణవేణి అన్నారు. మంగళవారం మండలంలోని పసర గ్రామంలో పార్లమెంటులో 33 శాతం మహిళ బిల్లు ఆమోదించిన సందర్భంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో టపాసులు కాల్చి జేజేలు పలికారు.
ఈ సందర్భంగా కృష్ణవేణి నాయక్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ నూతన పార్లమెంటు భవనంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సంపూర్ణ మహిళా సాధికారత సాధించే దిశగా చట్టంలో 33% మహిళా బిల్లు క్యాబినెట్ ఆమోదించి చారిత్రాతక నిర్ణయం తీసుకున్నరన్నరు. ప్రధాని నరేంద్ర మోడీ కి ములుగు జిల్లాలోని మహిళలందరూ గోవిందపేట మండలంలోని మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు అంతిరెడ్డి రమాదేవి సమక్షంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ములుగు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చందా జ్యోతి గారి ఆధ్వర్యంలో మోడీ కి పాలాభిషేకం చేస్తున్నామని అన్నారు . ప్రధాని నరేంద్ర మోడీ మహిళలకు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని త్రిపుల్ తలాక్ ,భేటీ పడావో ,బేటి బచావో, మహిళలు కు చట్టసభలో 33 శాతం రిజర్వేషన్ కల్పించి 75 సంవత్సరాల నిరీక్షణకు ఫలితాన్ని తెప్పించినారు అన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన ములుగు జిల్లా బిజెపి కార్యదర్శి మేడిశెట్టి ఓమ్రా, జిల్లా కార్యదర్శి చౌగాని స్వప్న, ములుగు జిల్లా మహిళా ఇన్చార్జ్, గార్లపాటి మంజులారెడ్డి, దావుల స్వప్న, దుబాసి సునీత, సముద్రాల మాధవి, బొంతల స్వప్న, బండారి కములమ్మ, నిడిఓలు సంధ్య,, దుర్గం సమ్మక్క తక్కలపల్లి దేవేందర్రావు ఏనుగు రవీందర్ రెడ్డి కర్ర సాంబశివారెడ్డి, రుద్రారపు సురేష్, మద్దినేని తేజ రాజు, మెరుగు సత్యనారాయణ, బైరు మహిపాల్ రెడ్డి, ఏదునూరి రమేష్, బద్దం జనార్ధన్, వంగాల సోమిరెడ్డి అంతి రెడ్డి సత్యనారాయణ రెడ్డి, బానోతు లకావత్ దీప్లాల్, ఎల్ జవహర్లాల్, అమ్మ లింగయ్య, బెల్లి లింగయ్య, బండ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.