వర్షాలు రాక మునుపే పనులు పూర్తి చేయండి….

– ప్రాజెక్ట్ మరమ్మత్తులు  పరిశీలించిన ఎమ్మెల్యే మెచ్చా
నవతెలంగాణ – అశ్వారావుపేట
వర్షాలు రాక మునుపే గేట్ లు బిగించి నీటి వృధా నిలువరించాలని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించారు. గుమ్మడవల్లి సమీపంలో గల పెద్ద వాగు ప్రాజెక్ట్ లో ఎమ్మెల్యే చొరవతో మంజూరైన రూ.1 కోటి 10 లక్షల నిధులతో  నిర్వహిస్తున్న గేట్ ల మరమ్మత్తులు ను ఆయన పరిశీలించారు. అక్కడ నుండి అనంతారం చేరుకుని రైతు వేదిక వద్ద ఇటీవలే జరిగిన క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో విజయం సాధించిన వారికి ప్రైజ్ మని మరియు ట్రోఫీ లను అందజేసారు.అదే గ్రామంలో గల డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల తో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.సీసీ రోడ్డు కావాలని కోరడంతో తప్పకుండా ఏర్పాటు చేస్తాననీ వారికి తెలిపారు.  గుమ్మడవల్లి లో నూతనంగా నిర్మించిన దేవాలయంలో అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ఐనాల సత్యనారాయణా చార్యులు(మునకుళ్ళ) వారి ఆధ్వర్యంలో బయ్యన్న గూడెం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ విశ్వనాధుని రామాచార్యులు పర్యవేక్షణలో గ్రామస్థుల నడుమ అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీశ్రీశ్రీ శీత లాంబా దేవి(బొడ్రాయి), శ్రీ గంగానమ్మ తల్లి, పోతురాజు లు, జీవ ధ్వజ స్తంభము ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు.అదే గ్రామంలో ఒక వార్డ్ లో మంచి నీరు రావట్లేదు అని తెలపడంతో సంబంధిత అధికారితో మాట్లాడి మంచి నీరు అందే విధంగ చేస్తానని తెలిపారు.వర్షాకాలం వస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని,ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందు తగు జాగ్రత్తలు పాటించాలని ఎ.ఎన్.ఎం లక సూచించారు. వినాయకపురం కాలని లో  దిడ్డి వీరబాబు – నాగ జయలక్ష్మి దంపతుల కుమారుడు దినేష్ వర్మ వివాహ వేడుకలో పాల్గొని ఆశీర్వదించారు. ఆయన వెంట ఎం.పి.పి శ్రీరామ మూర్తి,జెడ్.పి.టి.సి వరలక్ష్మి,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love