నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్: పార్లమెంటు ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థుల ఖర్చుల లెక్కల తనిఖీలో భాగంగా రెండవ విడత తనిఖీని మంగళవారం ఎన్నికల సంఘం వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదీత్య భవన్లో నిర్వహించారు. మొత్తం 22 మంది అభ్యర్థులకు గాను, 19 మంది అభ్యర్థులు ఈ తనిఖీకి హాజరై వారికి సంబంధించిన ఖర్చుల రిజిస్టర్లు, రికార్డులను, రిపోర్టులను సమర్పించారు. ఖర్చులకు సంబంధించి రిపోర్టులతో పాటు, ఏబిసి ఫార్మేట్లను పరిశీలించారు. అంతేకాక షాడో రిజిస్టర్ తో సరిపోల్చి చూశారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యయ పరిశీలకులు కే.సురేష్, జిల్లా కోపరేటివ్ అధికారి,ఎన్నికల ఎక్సపెండిచర్ నోడల్ అధికారి కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.