ఈనెల 9 శనివారం నుండి ప్రారంభం కానున్న ఇంటింటి సమగ్ర సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు సామజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా మూడు రోజుల పాటు జరుగుతున్న హౌస్ లిస్టింగ్ సర్వే లో ఇండ్ల జాబితా సర్వే ముగిసిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా పూర్తి సర్వే నిర్వహించాలని, ఎక్కడ కూడా పొరపాట్లకు, తప్పులకు తావివ్వకుండా సరైన సమాచారాన్ని ఫారం లో నమోదు చేయాలని పేర్కొన్నారు. సేకరించిన వివరాలను కంప్యూటరైజ్డ్ చేయడానికి సుశిక్షితులైన డాటా ఎంట్రీ ఆపరేటర్ల ను నియమించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సర్వేలో ప్రతీ ఒక్క కుటుంబం పాల్గొనేలా ప్రతీ రోజూ విస్తృత ప్రచారం చేపట్టాలని పేర్కొన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఏమైన సందేహాలు, సలహాలకు సంబంధిత ప్రత్యేక అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని పేర్కొన్నారు. సర్వే టీమ్ ఎలాంటి పొరపాట్లు జరగకుండా అతి జాగ్రత్తగా సర్వే నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్తశుద్దితో కృషిచేయాలని సంబంధిత సర్వే టీమ్ ను ఆదేశించినట్లు పేర్కొన్నారు.