– డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శిరీష
నవతెలంగాణ – నసురుల్లాబాద్
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవలను వైద్య సిబ్బంది ప్రజలకు అందించాలని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ శిరీష ఆదేశించారు. శుక్రవారం బాన్సువాడ డివిజన్ పరిధిలోని నసురుల్లాబాద్ మండలం నెమ్లి వెల్నెస్ సెంటర్ లో ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మండల డివిజన్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎం హెచ్ ఓ డాక్టర్ శిరీష మాట్లాడుతూ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం లో చాలా మార్పులు వచ్చాయని అందుకు అనుగుణంగా ప్రతి ఆరోగ్య కార్యకర్త పని చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతంలోని ఆయా గ్రామాల ఆరోగ్య ఉప కేంద్రాల్లో గాను మరియు అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణీ స్త్రీల నమోదు కార్యక్రమం, గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరీక్షలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు అయ్యేలా చూడడం, మగ మరియు మహిళలకు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించి కుటుంబ నియంత్రణ జరిగేలా చూడాలన్నారు. అలాగే పిల్లలకు సంపూర్ణ టీకాలు వేసే విధంగా కృషి చేయాలన్నారు.
మలేరియా, ఫైలేరియా, లెప్రసి, సుఖ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ, బాధితులను గుర్తించి సమాచారం అందించాలన్నారు.. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీలేఖ రోహిత్, ఆరోగ్య అధికారులు సుధాకర్ రాధా కిషన్ దయానంద్ సుధాకర్ దస్థిరాం సాయిలు అన్వరి వేగం యశోద నరసమ్మ సుశీల ఆరోగ్య సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.