నవతెలంగాణ – ములుగు
ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ సోమరాజన్న అని ఏంసీపిఐ యు జిల్లా కార్యదర్శి గుండేబోయిన చంద్రయ్య అన్నారు. ములుగు జిల్లాలోని మల్లంపల్లి మండలంలో కామ్రేడ్ సోమ రాజన్న పదోవ వర్ధంతి సభ గుండెబోయిన కొమురక్క నివాసములు కామ్రేడ్స్ మధ్య గురువారం వేగిన కొమురయ్య అధ్యక్షతన వర్ధంతి సభ నిర్వహించారు. మొదట సోమరాజన్న చిత్రపటానికి కి సమావేశం జోహార్ లర్పించి పూలతో నివాళులర్పించినవారు. ఈ వర్ధంతి సభకు ముఖ్య అతిథులుగా గుండెబోయిన చంద్రయ్య పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ..కామ్రేడ్ సోమ రాజన్న పేదల కోసం కమ్యూనిస్టు పార్టీలు చేరి భూస్వాములు పెట్టుబడిదారీ ఫ్యుడల్ ప్రభువుల జాగిరిదారులు శరీరార్ల పటేల్ పట్వారి ఆగడాలను దుర్మార్గాలను ఎదిరించి ప్రజల తరఫున పోరాడినా నాయకుడని అన్నారు. గ్రామాల్లో పేద ప్రజలు రైతులు కార్మికులు మహిళలు కు స్వేచ్ఛ లేని రోజులు 1970 నుండి గ్రామాల్లో కూలి రేట్ల కోసం జీతాల సంఘాలు పెట్టి మహిళా సంఘాలు పెట్టి కూలిరేట్లను పెంచుటకు గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలను చైతన్య పరుస్తూ సభలు సమావేశాలు రాత్రిళ్లు మీటింగ్లు పెట్టి ప్రజలను చైతన్యం పరిచేవారబిన్నారు. పగబట్టిన భూస్వాములు వారి గుండాలు అనేక దాడులు గురైన నాయకుడు ఓ పక్క ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు కుట్రలు కుర్తంత్రాలతో తప్పుడు కేసులు బనాయించేవారు ఎన్ని కుట్రలు చేసిన మొక్కవోని ధైర్యంతో ప్రజల తరపున పనిచేసిన నాయకుడు సోమరాజన్న అని అన్నారు. ములుగు జిల్లాలో రామచంద్రపురం గ్రామంలో కామ్రేడ్ ఎండి సర్వర్ ఇంటి వద్ద రాత్రిపూట సమావేశాలు జరుపుతుండగా నక్సలైట్లు కాల్పులు జరిపి కామ్రేడ్ సర్వర్ ఆయన గుండెను ఎదురు పెట్టి సోమరాజన్నను కాపాడుకున్నారన్నారు. కాల్పుల్లో దొంతి ప్రతాపరెడ్డి, మిట్టకంటి వీరారెడ్డి గాయాలవ్వగా సర్వర్ మరణించినారనీ, కామ్రేడ్ సోమరాజన్న అదరలే బెదరలే అని ఎంసిపిఐ యు పార్టీ నిర్మాణం కోసం పనిచేసిన నాయకుడు అయిన ఆశయం కార్మిక కర్షక రాజ్య స్థాపన సోషలిజం కమ్యూనిజం సాధించాలని ఆయన వర్గ చైతన్యాన్ని ప్రతి ఒక్క కార్మికులు రైతులకు చైతన్యాన్ని నింపిన సిద్ధాంత కర్త ఓంకార్ కి కుడి భుజంగా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేసినారన్నారు. ఆయన యొక్క ఆశయం స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాలని ప్రజల తరఫున పని చేద్దామని పిలుపునిచ్చినారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధ్య వేగిన కొమురయ్య, శ్రీనాథ్, నునా వతు చంద్రు నాయక్, రాసర్ల చంద్రమౌళి, కామ రవి, గుండెబోయిన కొమురక్క, మెరువ ఐలయ్య, వడ్లూరి వెంకన్న, జ్యోతి పాల్గొన్నారు.