నవతెలంగాణ – హైదరాబాద్: పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో పార్లమెంట్‌లో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఈ విషయంపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో క్రీడాశాఖ మంత్రి ప్రకటన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. కాగా ఇంతకుముందే వినేశ్ ఫొగట్‌పై కాంగ్రెస్ ఓ వీడియో విడుదల చేసింది. ‘అప్పుడు ఢిల్లీ వీధుల్లో పోరాడారు. ఇప్పుడు రెజ్లింగ్ మ్యాట్‌పై పోరాడుతున్నారు’ అంటూ ప్రశంసించింది.