– జూన్ రెండో వారం ముగిసిన కురియని వర్షాలు..
– వానాకాలం పంట సాగుకు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకున్న రైతన్నలు
– ప్రతిరోజు ఆకాశం వైపు వర్షం కోసం ఎదురుచూపులు
– మద్నూర్ ఉమ్మడి మండలంలో 46 వేల ఎకరాల సాగుకు సిద్ధం
నవతెలంగాణ – మద్నూర్
వానకాలం పంట సాగు కోసం వర్షాలు ముఖం చాటేయడంతో జూన్ మాసం రెండో వారం ముగియడంతో అన్నదాతలంతా ఆందోళన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం జూన్ మాసం వచ్చింది అంటే రైతన్నకు వానాకాలం పంట సాగు ప్రారంభమైనట్లే జూన్ మొదటి వారంలో వర్షాలు కురియాలి. అలాంటి వర్షాలు జూన్ మాసం రెండో వారం ముగుస్తున్నా.. పడకపోవడం రైతన్నలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం పంట సాగు కోసం మద్నూర్ ఉమ్మడి మండలంలో రైతన్నలంతా కావలసిన విత్తనాలు ఎరువులు సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నప్పటికీ, ప్రతిరోజు రైతన్నలు ఆకాశం వైపు వర్షాల కోసం ఎదురు చూస్తుంటే, వర్షాకాలం ముఖం చాటేసినట్లే కనిపిస్తోంది. ఈ వారంలో వాతావరణ కేంద్రం వర్షాలు కురుస్తాయని తెలిపినప్పటికీ, ఈ ఉమ్మడి మండలంలో వర్షాలు పడడం లేదు. ఆకాశమంత నల్లటి మబ్బులతో రైతన్నలకు వర్షం పడుతుందని, పై విధంగా కనిపిస్తున్నప్పటికీ అలాంటి నల్లటి మబ్బులు ఎక్కడికి పారిపోతుందో అర్థం కాని పరిస్థితి ఈరోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ తమ తమ ఫోన్ లోనే వెదర్ గురించి చూసుకుంటున్నారు. ఈరోజు వర్షం పడుతుందని అనుకుంటున్నప్పటికీ వర్షం పడడం లేదు. అంటే రైతన్న ఆందోళనకు గురి అవుతున్నారు. మద్నూర్ ఉమ్మడి మండలంలో వ్యవసాయ శాఖ అధికారుల నివేదికలను బట్టి చూస్తుంటే ఈ ఉమ్మడి మండలంలో వానాకాలం పంట సాగు నలభై ఆరువేల పైచిలుకు ఎకరాలు సాగుకు రైతన్న సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వీటికి కావలసిన విత్తనాలు ఎరువులు లక్షలాది రూపాయలు వెక్కించుకొని రైతన్న సాగుకు సిద్ధం అయినప్పటికీ, వర్షాకాలం ముఖం చాటేస్తోంది. ఇటీవల మద్నూర్ మండల కేంద్రంలో గ్రామానికి నడి ఒడ్డున గల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు గ్రామదేవతలకు శిలాభిషేకం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వర్షాల కోసం వ్యవసాయ రైతులంతా ప్రతిరోజు ఆకాశం వైపు ఎదురు చూడవలసిన దుస్థితి నెలకొంది. అన్ని సిద్ధం చేసుకున్న కావలసిన వర్షాలు పడకపోవడం రైతన్నలకు ఆందోళన కలిగిస్తుంది. జూన్ మాసం రెండో వారం ముగిసిన ఈ నెలాఖరు వరకు వానాకాలం పంట సాగుకు అనుకూలమేనని వ్యవసాయ అధికారుల అంచనాలు తెలుపుతున్నాయి. రైతన్నలు జూన్ మొదటి వారంలో సాగు అవుతే పంటలు బాగు పండుతాయని రబ్బి పంట సాగు కోసం వానాకాలం పంట సమయానికి చేతికి వస్తుందని, రైతన్న ఆశ రైతన్నల ఆశను ఏడాది వర్షం ముఖం చాటేస్తుంది. వానాకాలం పంట సాగు కోసం వర్షం తిప్పలు ఇలా ఉంటే ఇక రబ్బి పంట సాగుకు వర్షాకాలం ఏ విధంగా అనుకూలిస్తాయని ఆందోళన రైతన్నలు వ్యక్తం అవుతుంది. ప్రతి గ్రామంలో రైతన్న వర్షం పడటానికి అన్నదానాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వరుణుడు కరుణించాలని కోరుకుంటున్నాను. ముఖం చాటేసిన వర్షాలు రైతన్న ఎదురు చూపులకు తెరదించేందుకు వెంటనే ఒకటి రెండు రోజుల్లో కావలసిన వర్షం పడాలని రైతన్న కండ్లల్లో ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో వర్షాలు పడతాయా లేదా అనేది రైతన్నలు ఎదురు చూస్తున్నారు.