ముగిసిన కవిత బెయిల్ పిటీషన్ వాదనలు.. తీర్పు రిజర్వు

 

నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. బెయిల్ పిటిషన్లపై సోమవారం కవిత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈరోజు దర్యాఫ్తు సంస్థల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పూర్తైన అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Spread the love