ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కుటుంబానికి పరామర్శ

నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని జన్నేపల్లి గ్రామానికి చెందిన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి పాతూరి రవిచంద్ర (33) ప్రమాదవశాత్తు రైలు కిందపడి మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పలువురు సోమవారం పరామర్శించారు. జమ్మూ కాశ్మీర్ ఎయిర్ ఫోర్సులో ఉద్యోగం చేస్తున్నారు. అతని భార్య పిల్లలు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు వెళ్లడంతో సికింద్రాబాద్ నుండి రైలులో కాకినాడ వెళ్లే ఎక్స్ప్రెస్ లో  పిడుగురాళ్ల వద్ద శుక్రవారం ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందాడు. కాగా అతని కుటుంబాన్ని బీజేపీ నాయకులు మువ్వ నాగేశ్వరరావు, వంశీ మోహన్, వ్యాపారవేత్త మోహన్ రావు, బుల్లి రాజు, పూర్ణచందర్ రావు పరామర్శించి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Spread the love