నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పాఠశాల మరియు ఇంటర్మీడియెట్ స్థాయిలో బోదించడానికి తాత్కాలిక బోధన సిబ్బంది ఎంపిక కొరకు 05. న ఉదయం 10 గంటల నుండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల / కళాశాల ధర్మారం, డిచ్ పల్లి మండలం లో డెమో తరగతులు నిర్వహించనున్నట్లు సంస్ధ నిజామాబాద్ రీజియన్ ఆర్ సి వో వి. మేరీ యేసుపాదం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీ పోస్టుల వివరాలు: జూనియర్ లెక్చరర్ (12), పిజిటి (5), టిజిటి (5), పిఇటి (2) అసిస్టెంట్ కేర్ టేకర్ (3) విద్యార్హతలు: జేఎల్ , పిజిటి పోస్టులకు యుజిసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పి.జి. డిగ్రీ తో పాటు బి.ఇడి అర్హత కలిగి ఉండాలని సూచించారు. టిజిటి పోస్టుకు విద్యార్హతలు.. యుజిసి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బిఎస్సీ / బిఎ/ బీకాం డిగ్రీ కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణతతో, బిఇడి అర్హత కలిగిఉండాలి. పిఇటి పోస్టుకు వ్యాయామ విద్యలో 50% మార్కులతో డిగ్రీ కలిగి ఉండాలని పేర్కొన్నారు. సబ్జెక్ట్ లా వారీగా ఖలీల వివరాలు ధర్మారంలో గల ఆర్ సి వో కార్యాలయంలో ప్రదర్శించబడ్డాయని తెలిపారు. అసిస్టెంట్ కేర్ టేకర్ పోస్టుకు విద్యార్హతలు: గుర్తించబడిన యూనివర్సిటీ నుండి ఏదేని సబ్జక్టులో డిగ్రీ తో పాటు బి.ఇ డి ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ వినియోగంలో ప్రావీణ్యత. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా ను ఒక తెల్లకాగితం పై వ్రాసి, తమ విద్యాహర్హతల దృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను జతచేసి ప్రాంతీయ సమన్వయాధికారి కార్యలయం, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల / కళాశాల ధర్మారంలో దరఖాస్తులను 29.06 నుండి 03.07. నాడు సాయంత్రం 05 గంటల లోగా సమర్పించుకొనవచ్చని వివరించారు. గడువు తేదీలోగా దరఖాస్తులు సమర్పించిన అభ్యర్ధులు మాత్రమే ఆ సబ్జక్టులో ఏదైనా ఒక నచ్చిన అంశంపై బోధనకు సిద్ధపడి, డెమో తరగతులకు హాజరుకావలసి ఉంటుంది. మేరి యేసుపదం పేర్కొన్నారు.