నవతెలంగాణ – నాగార్జున సాగర్ : నాగార్జున సాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారుల మధ్య వివాదం జరిగింది. నాగార్జున కుడి కాలువ వద్ద వాటర్ రీడింగ్ నమోదు చేసేందుకు తెలంగాణ అధికారులు వెళ్లారు. తెలంగాణ అధికారులను ఎపి అధికారులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. కెఆర్‌ఎంబి యాజమాన్యానికి తెలంగాణ అధికారులు సమాచారం ఇచ్చారు. ఇరు రాష్ట్రాల అధికారులకు సాగర్ ఎస్‌ఇ కృష్ణమోహన్ సర్ది చెప్పారు.