కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సమన్యాయం..

– కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ కవ్వంపల్లి 
– రేగులపల్లిలోని అయా పార్టీల శ్రేణులు కాంగ్రెస్ లో చేరిక 
నవతెలంగాణ-బెజ్జంకి
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు సన్నద్దమవ్వాలని మానకొండూర్ నియోజకవర్గ ఇంచార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.బుధవారం మండల పరిధిలోని రేగులపల్లి గ్రామంలోని మాజీ డైరెక్టర్ జంగిలి  తిరుపతి, గౌడ సంఘ అధ్యక్షులు గైని శ్రీను, పలువురు బీఆర్ఎస్,  బీజేపీ శ్రేణులు, కుల సంఘాల నాయకులు రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, నాయకుడు మనాల రవి అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కవ్వంపల్లి సత్యనారాయణ హజరై పార్టీలో చేరిన అయా పార్టీల శ్రేణులకు, కుల సంఘాల నాయకులకు కాంగ్రెస్ కండువాలు కప్పి ఆత్మీయంగా ఆహ్వానించారు. నాయకులు రత్నాకర్ రెడ్డి, రొడ్డ మల్లేశం, మాజీ సర్పంచ్ చెప్యాల శ్రీనివాస్, మంకాల ప్రవీన్,శానగొండ శరత్, పోతిరెడ్డి మధుసూధన్ రెడ్డి, చింతలపల్లి జనార్ధన్ రెడ్డి,దోనే వెంకటేశ్వర్ రావు, మెట్ట నాగారాజు, అయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love