విత్తనాల గందరగోళాన్ని ఆపాలి..

– తీగల ఆగి రెడ్డి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి
నవతెలంగాణ- గోవిందరావుపేట
వ్యవసాయ అధికారులు రైతులకు సూచనలు ఇవ్వాలి సిపిఎం డిమాండ్ మండల వ్యాప్తంగా కొనసాగుతున్న విత్తనాల గందరగోళాన్ని వెంటనే ఆపాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తీగల ఆగిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని పసర గ్రామంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సిపిఎం నాయకులు మరియు రైతుల సమావేశంలో ఆగిరెడ్డి మాట్లాడారు. రైతులు వరి నారు పోసే ముందు కొన్ని రకాల విత్తనాలు వేసుకోవాలి మరి కొన్ని రకాల విత్తనాలు వేయొద్దు అని రైతులను మిల్లు యాజమాన్యం రోజుకో ప్రకటన చేస్తూ గందరగోళం పెడుతున్నారు. పై విషయాల కనుగుణంగా సిపిఎం మండల నాయకత్వం వ్యవసాయ అధికారులతోని మాట్లాడడం జరిగింది. అధికారికంగా అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పింది ఏమనగా స్వర్ణ క్రాస్,1318, 1001 కానీ మిగతా ఏ రకాన్ని గవర్నమెంట్ నిషేదించలేదని తెలియజేశారు.కావున రైతులు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఏ విత్తనాలైనా వేసుకోవచ్చు అని చెప్పారు. కానీ మిల్లర్లు కావాలని కొంత గందరగోళ పరిస్థితులను సృష్టించడానికి ములుగు జిల్లా అసోసియేషన్ పునుకుందని అర్థమౌతుంది. రైతుకు నచ్చకపోయినా పండక పోయిన పర్వాలేదు. కొనేది మేము కాబట్టి మేము చెప్పిన ధాన్యాలనే నాటుకోవాలి అనడం సమంజసం కాదు అన్నారు. ఇతర జిల్లాల వారు ఓకే అన్న కూడా మన జిల్లా వాళ్లు మాత్రం ఎంపియు 1318 విషయంలో ఓకే చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.కావున మనమందరం మనకు నచ్చిన ఒడ్లు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని కోరడం జరుగుతుంది. మిల్లర్లు ఏదైతే బోర్డు పెట్టారో వాట్సాప్ లో ట్రెండ్ చేస్తున్నారో అదంతా అనధికారికంగా చేస్తున్నారు.ఇప్పటికైనా మిల్లర్లు పునరావలసించాల్సిందిగా కోరుతున్నాము.లేనిచో ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మీద అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు..అధికారికంగా అసలు మిల్లర్లకు కొనుగోలుకు సంబంధం లేదు. అవి ప్రభుత్వం కొంటుంది.ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రభుత్వం చూసుకోవాలా తప్ప మిల్లర్లకు ఏంటి సంబంధం లేదు.మిల్లర్ల ఆధిపత్యాన్ని ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమంలోకడారి నాగరాజు,పొదిలి చిట్టిబాబు, సోమమల్లారెడ్డి, గుండు రామ స్వామి, కాప కోటేశ్వరావు పాల్గొన్నారు.

Spread the love