బ్రిక్స్‌లో చేరేందుకు కాంగో ఆసక్తి

బ్రిక్స్‌లో చేరేందుకు కాంగో ఆసక్తిబ్రిక్స్‌లో సభ్యత్వం పొందేందుకు తమ దేశ ఆసక్తిని రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో అధ్యక్షుడు డెనిస్‌ సస్సౌ న్గెస్సో వ్యక్తం చేశారు. ఆఫ్రికన్‌ నాయకుడు ఈ వారం రష్యా చేరుకున్నారు. అక్కడ అతను అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సమావేశమయ్యారు. ఆఫ్రికా దేశం బ్రిక్స్‌తో సంబంధాలను పెంపొందించుకోవడానికి ఆసక్తి చూపుతుందని గురువారంనాడు రష్యా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సస్సౌ న్గెస్సో నొక్కి చెప్పారు. ‘బ్రిక్స్‌ను 2006లో బ్రెజిల్‌, రష్యా, భారతదేశం, చైనా స్థాపించాయి. దక్షిణాఫ్రికా 2011లో చేరింది. ప్రస్తుతం రష్యా బ్రిక్స్‌ చైర్మెన్‌గా ఉంది. ఈ సంవత్సరం ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పూర్తి సభ్యులుగా మారినప్పుడు బ్రిక్స్‌ విస్తరించింది’ అని తెలిపారు.
సస్సౌ న్గెస్సో మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన సందర్భంగా ఆఫ్రికన్‌ నాయకుడికి రష్యన్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ఆనర్‌ లభించింది. రష్యన్‌ ఫెడరేషన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో మధ్య సంబంధాల అభివద్ధి, పటిష్టతలకు ఆయన చేసిన గణనీయమైన కషికి డెనిస్‌ సాసౌ న్గెస్సో ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సమావేశంలో, రష్యా-కాంగోల సంబంధాల అభివద్ధికి సాసో న్గెస్సో గణనీయమైన వ్యక్తిగత సహకారం అందించాడని పుతిన్‌ మెచ్చుకున్నారు. సాసో న్గెస్సో రెండు రష్యా-ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొన్నారు. మేము అన్ని రంగాలలో మా సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నాము అని పుతిన్‌ చెప్పారు. రష్యా, రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవాన్ని ఈ సంవత్సరం జరుపుకుంటున్నారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని కాంగో గౌరవ కాన్సుల్‌ జోసెలిన్‌-పాట్రిక్‌ మాండ్‌జెలా ప్రకారం, సాసౌ న్గెస్సో ఉత్తర రష్యన్‌ నగరాన్ని కూడా సందర్శిస్తారు. అక్కడ స్థానిక గవర్నర్‌తో సమావేశమవటంతోపాటు అనేక కార్యక్రమాలలో పాల్గొంటారు. జూన్‌ ప్రారంభంలో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ కాంగోకు అధికారిక పర్యటన చేశారు. అక్కడ ఆయన దేశ నాయకత్వంతో చర్చలు జరిపారు. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను పెంపొందించడం, ఇంధన రంగ ప్రాజెక్టులను అభివద్ధి చేయడం, సైనిక-సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయడంవంటి విషయాలపై లావ్రోవ్‌ చర్చించాడు.

Spread the love