హాఫ్ మారథాన్  విజయవంతం చేసిన అందరికీ అభినందనలు

– పోలీస్ కమిషనర్ శ్వేత
నవతెలంగాణ – సిద్దిపేట
ఆగస్టు 6న జరిగిన హాఫ్ మారథాన్ ను సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు,  ఆర్గనైజర్లు, వాలంటీర్లు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. ఆరోజు రన్ లో పాల్గొనలేకపోయారతో కలసి ఆదివారం  సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి రంగనాయక సాగర్ ప్రాజెక్టు వరకు  21కె, 10కె హాఫ్ మారథాన్ ను పోలీస్ కమిషనర్  ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆగస్టు 6న జరిగిన హాఫ్ మారథాన్  విజయవంతం చేసిన సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను అభినందించారు. మంత్రి హరీశ్ రావు  ప్రతి సంవత్సరం హాఫ్ మారథాన్  రన్ నిర్వహిస్తామని ప్రకటించడం జరిగిందని, దానికి సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.  మనిషి జీవనశైలిలో భాగంగా రన్నింగ్, వాకింగ్, యోగ ఒక భాగం చేసుకోవాలని సూచించారు. రన్నింగ్ లో మెలికలు నేర్చుకోవడానికి, రన్నింగ్ లో ఎంజాయ్ చేయడం గురించి హైదరాబాద్ అథ్లెటిక్ కోచ్ నిరంజన్  ఆధ్వర్యంలో మెలుకువలు నేర్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తిగల యువతి యువకులు సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ వారి వద్ద పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కత్తుల బాపురెడ్డి, అథ్లెటిక్ కోచ్  నిరంజన్, సిద్దిపేట ఏసిపి సురేందర్ రెడ్డి,
ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, ఇన్స్పెక్టర్లు/ సిఐలు కృష్ణారెడ్డి, రవికుమార్, భాను ప్రకాష్, చేరాలు, పోలీస్ సిబ్బంది, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ఆర్గనైజర్లు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love