నూతన ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి జిల్లాలో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సీపీఐ(ఎం) పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నామని నిజామాబాద్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు సీపీఐ(ఎం) తరఫున తెలియజేశారు. నిజాంబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సీపీఐ(ఎం) పార్టీ సమావేశంలో వివిధ సమస్యల పైన చర్చించి ప్రభుత్వానికి వాటిని తెలియజేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా శాసనసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా గత ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరించటం వలన మార్పును కోరుకున్నారని నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు జరపడంతో పాటు ప్రజా హక్కులను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుటతో పాటు ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అదేవిధంగా మ్యానిఫెస్టోను అమలు జరపాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించని ఎడల కొంతకాలం వేచి చూసిన తర్వాత ప్రజా సమస్యలపై పోరాటాలను నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, పల్లపు వెంకటేష్, జై శంకర్ గౌడ్, గంగాధర్, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.