ప్రజల నమ్మకంతోనే అధికారంలోకి కాంగ్రెస్‌

– దళారుల వ్యవస్థకు తావు ఇవ్వబోం
– ప్రజల వద్దకే పాలన
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి
నవతెలంగాణ-తాండూర్‌ రూరల్‌
ప్రజల నమ్మకంతోనే కాంగ్రెస్‌ రాష్ట్రంలో 10 ఏండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మం డలం కరణ్‌ కోటలో ప్రజాపాలన గ్రామసభలో ఎమ్మెల్యే మనో హర్‌రెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల నమ్మకమే కాంగ్రెస్‌ను అధికారం లోకి తీసుకొచ్చిందన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయ కుండా అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోపు మహిళ లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, హెల్త్‌ బీమా, పెంపు సౌకర్యాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్పించిందన్నారు. మరో 3 నెలలలోపు మిగిలిన 4 గ్యారంటీలా అమలు కోసం కసరత్తు ప్రారంభించిందని అందకే గ్రామాల్లో ప్ర జా పాలన గ్రామసభలు నిర్వహించి ప్రజల నుండి దర ఖాస్తులు తీసుకుంటుంద న్నారు. జిరాక్స్‌ సెంటర్లలో దర ఖాస్తులు విక్రయిస్తే వారిపైన చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారన్నారు. ఎవరూ ఆందోళన చెందకుండా ఏ ఒక్కరికీ రూపాయి చెల్లించ కుండా దరఖాస్తులు చేసుకోవాలని ఎవరైనా డబ్బులు వ సూలు చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నా రు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో దళారులకు తావు లేదన్నారు. ప్రజల సౌలభ్యం కోసమే అధికారులను గ్రామాల్లోకి తెచ్చి వారి దరఖాస్తు స్వీకరిస్తుందన్నారు. గ్రామ సభల్లో అందుబాటులో లేని దరఖాస్తుదారులు ఈనెల 6వ తేదీ వరకు తహసీల్దార్‌ ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. కరణ్‌ కోట పోస్ట్‌ ఆఫీస్‌ అధికారి ఇంటికి పింఛన్‌ ఇచ్చేందుకు వెళ్లి ఒక్కొక్క వృద్ధు రాలి దగ్గర రూ.200 వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అలాంటి వ్యవస్థ కొనసాగిస్తే సస్పెన్షన్‌ చేయిం చేందుకు వెనకడుగు వేయబోమని ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కా ర్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి చక్రపాణి, తహసీ ల్దార్‌ తారాసింగ్‌, రూరల్‌ సీఐ రాంబాబు, ఎస్సై మధు సూదన్‌ రెడ్డి, ఏవో రజిత, డీసీసీబీ డైరెక్టర్‌ రవీందర్‌ గౌ డ్‌, జడ్పీటీసీ, మంజుల వెంకటేశం, వాయిస్‌ ఎంపీపీ స్వ రూప వెంకట్‌రాంరెడి సర్పంచ్‌ వీణా హేమంత్‌, ఎంపీ టీసీలు రాజ్‌ కుమార్‌, శివకుమార్‌, వసంత్‌ కుమార్‌, పం చాయతీ కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు, తది తరులు పాల్గొన్నారు.

Spread the love