ప్రజాయుద్ద నౌక, గద్దరన్నకు కాంగ్రెస్ జోహార్లు..

నవతెలంగాణ -గోవిందరావుపేట
ప్రజా యుద్ధ నౌక విప్లవ గాయకుడు గద్దర్ అన్న మృతికి సంతాప సూచకంగా కాంగ్రెస్ పార్టీ జోహార్లు పలికింది. సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు గద్దర్ మృతికి సంతాప సూచకంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వెంకటకృష్ణ  మాట్లాడుతూ ప్రజా సమస్యలను తన గళంతో వినిపించే ప్రజా గొంతుక మూగబోయింది అని అన్నారు. గద్దర్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1948లో దళిత కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లా మహబూబ్ నగర్ లో, ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నాడు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు.తెలంగాణ ఉద్యమం పునరుద్ధరించడంతో, గద్దర్ మరోసారి వెనుకబడిన కులాలు, నిమ్న కులాల ఉద్ధరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం తన మద్దతును తెలపటానికి ప్రారంభించాడు. బలమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నప్పటికీ, అతను ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని వ్యతిరేకించే భారతదేశం లోని కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో తన భావాలను పంచుకోలేదు.గద్దర్ మొదటి నుండి తెలంగాణా వాదే. మావోయిస్టు పార్టీ తెలంగాణాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆయన తెలంగాణకే మద్దతు తెలిపారు. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణా పార్టీ పెట్టినప్పుడు ఆయనకు కూడా మద్దతు తెలిపారు గద్దర్. గద్దర్ పై దాడి జరిగినప్పుడు హోం మినిస్టర్ దేవేందర్ గౌడ్. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణా ప్రజా ఫ్రంట్ ను స్థాపించాడు. గుండెపోటు కారణంగా 2023 జూలై 20న హైదరాబాద్‌, అమీర్ పేట్ లోని అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్ కు ఆగస్టు 3న వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. తరువాత ఆసుపత్రిలోనే చికిత్సపొందిన గద్దర్ ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలతో 2023, ఆగస్టు 6న మధ్యాహ్నం 3 గంటలకు మరణించాడు. వారి మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటు అని, వారి మృతికి సంతాపాన్ని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, సహకార సంఘ పాలకవర్గ సభ్యులు జెట్టి సోమయ్య, ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, మండల ఎస్.సి.సెల్ అధ్యక్షులు పడిదల సాంబయ్య, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జంపాల చంద్రశేఖర్, మండల మహిళా ఉపాధ్యక్షురాలు చొప్పదండి వసంత, దేపాక కృష్ణ, సామ శ్రీలత, గోపిదాసు వజ్రమ్మ, ఇమ్మడి విజయ, బుచ్చమ్మ తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love