కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ 

నవతెలంగాణ- నసురుల్లాబాద్ 
గ్రామపంచాయతీ కార్మికుల కనీస సౌకర్యాలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ కూనిపూర్ రాజారెడ్డి రాష్ట్ర ఎంపీటీసీ ఫోరం మాజీ కన్వీనర్ ఎలమంచిలి శ్రీనివాస్ రావు రాష్ట్ర ఎస్టీ సెల్ నాయకుడు ప్రతాప్ సింగ్ రాథోడ్ కోరారు. బుధవారం నస్రుల్లాబాద్ మండలం లోని బొమ్మ న్ దేవ్ పల్లి చౌరస్తాలో మండల గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ..గ్రామపంచాయతీ కార్మికుల వేతనాల పెంపు మరియు ఉద్యోగ భద్రత కోసం సమ్మె నేటికీ 28 రోజులు గడుస్తున్నా కానీ. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం సోచనియం అన్నారు. కార్మికుల ఉద్యోగ భద్రత, పీఎఫ్ ఇఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ప్రమాదవశాస్తు మరణించిన కార్మికుల కుటుంబానికి 20 లక్షలు ఇన్సూరెన్స్ సౌకర్యం, పారిశుద్ధ్య కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ అందించాలని,మల్టీపర్పస్ జీవోను సవరించి, కేటగిర్ల వారిగనే పనులు కొనసాగించాలని, కారోబార్లను పంచాయతీ సహాయ కార్యదర్శి లుగా నియమించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలిచి పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందు పటేల్, సొసైటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి, నసురుల్లాబాద్  సర్పంచ్ అరిగే సాయిలు బొమ్మన్ దేవ్ పల్లి సర్పంచ్ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీలు శంకర్ నాయక్, మల్లేశం గౌడ్, మాజీ సర్పంచ్ శాంతయ్య, మండల కార్యదర్శి శివప్రసాద్, మైనారిటీ అధ్యక్షులు యూసఫ్, తుమ్ సాయ గౌడ్ తదతరులు ఉన్నారు.
Spread the love