– దళిత బంధు బీసీ బందును బీఆర్‌ఎస్ బందుగా మార్చారు..
– అవినీతికి పాల్పడే కూసుకుంటను ఓడించి ..
– ఆపదలో ఆదుకునే రాజగోపాల్ రెడ్డి ని గెలిపించండి..
– ఆపదలో ఆదుకునే రాజగోపాల్ రెడ్డి ని గెలిపించండి..
నవతెలంగాణ- మునుగోడు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు మారుతాయి అని ఎదురుచూసిన పేద ప్రజలకు గత పది సంవత్సరాలుగా పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం చేసినది ఏమీ లేదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చల్మెడ గ్రామంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలపై గడపగడప తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజా అవసరాలను పట్టించుకోకుండా కమిషన్ల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దోసుకు తిన్నారని మండిపడ్డారు. మరోసారి కెసిఆర్ మాయమాటలు నమ్మి గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తారని అన్నారు. కెసిఆర్ ఎన్నికలు వచ్చినప్పుడు ఎత్తుగడలు వేస్తూ మాయమాటలు చెప్పి కొత్త కొత్త హామీలను ఆశ చూపి ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఒకే విడత రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పథకం వంటి పథకాలను ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిసి లకు ప్రతి ఏడాది సబ్సిడీ లోన్లను ఇచ్చి ఎంతోమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. గత పది సంవత్సరాలుగా కేసీఆర్ సబ్సిడీ లోన్లు ఇవ్వకుండా దళిత బంధు బీసీ బందు అని పెట్టి అర్హులైన లబ్ధిదారులకు అందించకుండా బీఆర్‌ఎస్ బందుగా మార్చారని ఆరోపణ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి , రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు , యువ వికాసం, చేయూత వంటి పథకాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు. అసెంబ్లీలో అభివృద్ధి కోసం నిధులు అడగమంటే నిద్రపోయే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కావాలనా.. అసెంబ్లీలోని ప్రతి సమస్య పరిష్కారం కోసం నిధులు ఇవ్వమని నాలుగేళ్లుగా ప్రభుత్వాన్ని నిలదీసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావాల్నా ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. అధికార పార్టీ అండతో అధికారులను అడ్డం పెట్టుకొని అక్రమంగా అవినీతికి పాల్పడిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఓడించి . అర్ధరాత్రి ఆపద వచ్చిన అన్న అంటే ఆదుకునే ఆపద్బాంధవుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బాతరాజు సత్తయ్య , ఉబ్బరబోయిన నరసింహ, గాదెపాక ప్రభాకర్, పగిళ్ల శ్రీరాములు, కొంక శంకర్, కొంక చంద్రయ్య , కొంక రాజు , కొంక రాము, సిపిఐ మండల సహాయ కార్యదర్శి బండమీది యాదయ్య తదితరులు ఉన్నారు.